అమరవీరుల సంస్కరణ దినం
*స్వేచ్ఛ, సంక్షేమం కోసం ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యవంతులకు నివాళులు*
*మాతృభూమి శ్రేయస్సు కోసం పనిచేసిన నిస్వార్థ శ్రామికులు పోలీసులే*
*ఘనంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం*
*రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు*
ప్రజల కోసం పోరాడుతూ అమరవీరులైన వారిని స్మరించుకోవడం మన అందరి బాధ్యత, మాతృభూమి శ్రేయస్సు పనిచేసిన నిస్వార్థ శ్రామికులు పోలీసులు అని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. వి.మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు కింజరాపు అచ్చనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మాత్యులు కింజరాపు అచ్చనాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్, జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా, ఎస్సీ కె.వి.మహేశ్వర్ రెడ్డి, శాసన సభ్యులు గొండు శంకర్, ఎన్ ఈశ్వర రావు లతో కలిసి పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పూల మాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు సిబ్బంది నిర్వహించిన స్మృతి పరేడ్ ద్వారా అమర వీరులకు నివాళులర్పించారు.