జగన్ అయిదేళ్ళ పాలనే రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు
విపత్తు వేళ కనీస సాయం అందించని జగన్ రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారు
ఇకనైనా వరద రాజకీయాలు మానుకోవాలి
వరదల మూలంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకునేందుకు నష్టం లెక్కలు వేస్తున్నాం
బుడమేరు, ఏలేరు రిజర్వాయర్ ఆధునికీకరణకు పకడ్బందీ ప్రణాళిక
ఏలేరు ఆధునికీకరణకు ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేయించారు
వైసీపీ పాలనలో 2020 నుంచి రైతులకు పంట బీమాకు రూపాయి కూడా ఇవ్వలేదు
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ Nadendla Manohar గారు