మహిళలుపై హింసకు పాల్పడితే చర్యలు* #atrnews #tdpnews #visakhanews

*మహిళలుపై హింసకు పాల్పడితే చర్యలు*

*నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి *

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం మహిళలుపై హింసకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు.

*అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక దినోత్సవం” సందర్భంగా పోలాకి ప్రభుత్వం జూనియర్ కళాశాల నుండి తాశీహల్దార్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్త్రీ హింస నిరోధక కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంపై మహిళల్లో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డిఆర్డిఎ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళలకు సంబంధించి న్యాయ కేంద్రాలు ఉన్నాయని, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి జిజిహెచ్ లో ఒన్ స్టాప్ సెంటర్ ఉందని మహిళలకు సంబంధించి కుటుంబ సమస్యలు ఉంటే న్యాయ సహాయం కోసం ఒన్ స్టాప్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒన్ స్టాప్ సెంటర్లు మహిళలు కోసం ప్రతీ చోటా ఉన్నట్లు చెప్పారు. ఇవే కాకుండా కౌన్సిలర్లను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కౌన్సిలింగ్ తర్వాత కోర్టులకు వెళ్లి లీగల్ ప్రొసీజర్ ఫాలవ్వడం ఉంటాయన్నారు. మండలాల వారీగా, సిడిపిఓ వారీగ మహిళలకు న్యాయ సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ పిహెచ్సీ, సిహెచ్సీలో కొన్సిలర్లు ఉంటారన్నారు. ఈ ర్యాలీ ద్వారా వైద్య ఆరోగ్య, మహిళా స్త్రీ శిశు సంక్షేమం, డిఆర్డిఎ లతో పాటు సచివాలయ సిబ్బంది మహిళల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ఎక్కడైనా మహిళలపై గృహ హింస లేదా పని చేసే స్థలాల్లో హింస జరిగితే స్థానిక, ఇంటర్ డిపార్ట్మెంట్, కలెక్టరేట్ లలో కమిటీలు ఉంటాయని, ఎక్కడైనా మహిళలు పై వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు చేస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ర్యాలీలో బాల్య వివాహ రహత భారత దేశం, జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారం, తదితర స్లోగన్లతో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భైరి భాస్కరరావు , మాజీ సర్పంచ్ లుకలాపు రాంబాబు , అధికారులు, విద్యార్థిని విద్యార్థులు వైద్య ఆరోగ్య శాఖ, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, డిఆర్డిఎ, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Relevant News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *