జత్వానీ కేసులో భయంతోనే.. నీలి మీడియా తప్పుడు రాతలు: పీతల సుజాత
ఏపీ రాజకీయాల్లో బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ వ్యవహరం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వైసీపీ నేతలపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసుపై మాజీ మంత్రి పీతల సుజాత వైసీపీ నేతలు, మాజీ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ… బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే.. నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని ఆరోపణలు చేశారు. నీలి మీడియాలో మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయటాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వాని కేసుకు దేశవ్యాప్త మద్దతు లభిస్తోందని అన్నారు. నీలి మీడియా మాత్రం దోషులను కాపాడేందుకు తప్పుడు రాతలు రాస్తోందని పీతల సుజాత ఆరోపించారు.