కేసినో ముఠా పాపం పండింది: పట్టాభి.
టీడీపీ నేత పట్టాభిరామ్ (TDP Pattabhi Ram) ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాయిలాండ్ పటాయా హోటల్లో కేసినో నిర్వహిస్తూ.. చికోటి గ్యాంగ్ పోలీసులకు పట్టుబడిందన్నారు. చికోటి ముఠాతో పాటు 100 మంది భారతీయులు అరెస్టయ్యారని అన్నారు. రూ.20 కోట్ల విలువైన గేమింగ్ చిప్ప్, రూ.100 కోట్ల విలువైన క్యాష్ లెడ్జర్స్ పట్టుబడ్డాయని పట్టాభిరామ్ పేర్కొన్నారు. చికోటి, కొడాలి నాని (Kodali Nani) ముఠాలు గుడివాడలో కేసినో నిర్వహించినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ పరిస్థితి దాపురించేదా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ (CM Jagan) అలసత్వం వల్లే మనం తల దించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. చీకోటి, కొడాలి నాని, వల్లభనేని వంశీల ధనదాహానికి పలువురు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడివాడ కేసినోలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా చర్యలు లేవన్నారు.
@Atrtvtelugu @CrimeTak
#casino #poker #gambling #bet #jackpot #casinoonline #betting #slots #lasvegas #onlinecasino #roulette #judionline #money #slot #win #blackjack #livecasino #sportsbetting #vegas #pokeronline #bonus #mega #sportsbook #football #bettingtips #sports #slotgame #kiss #live #baccarat